మనం మాట్లాడుకొని ఎన్ని రోజులవుతుందో తెలుసా . ప్రతిరోజు ఎన్నో విషయాల్లో పోట్లడుకోనేవాళ్ళం . నీకు ఎన్నో విషయాలు చెప్పాలని , నిన్ను తిట్టాలని , నేను తిడుతుంటే నువ్వు నన్ను చూసి నవ్వుతుంటే, నేను మల్లి కోపం మర్చిపోయి 'దొంగ గాడిది '. అని తిట్టాలని ఉంది ..
నీకు గుర్తుందా ,,,, ఓ రోజు మనం టీవీ లో ఏదో సినిమా చూస్తూ నువ్వు నన్ను అడిగావు , మమ్మీ 'జన్మ ల 'గురించి నువ్వు నమ్ముతావ ? ఇవన్నీ ఒట్టి మూడ నమ్మకాలూ కాదా ? అని అడిగావు .
దానికి నేను ఎం సమాధానం చెప్పానో గుర్తుంద ,,, నేను ' కర్మ సిద్ధంతాన్ని ' నమ్ముతాను . మనం చేసే ప్రతి పనికి ఏదో రూపమ్ లో మనం ప్రతిఫలం అనుభవిస్తం . అది ఈజన్మ లో కాకున్నా , ఏదో జన్మ లో మనం అనుభవించాల్సిందే .....
ప్రతి మనిషికి దేవుడు ఏదో పనులు చెపుతాడు, అవి నెరవేర్చి కానీ మనం ఈ భూమి మిది నుండి వెళ్ళలేము , ఒకవేళ అవి చేయకుంటే మళ్లీ మనల్ని పుట్టిస్తాడు.
ఇప్పుడు నిన్నే తీసుకోరాదు ,,, నీ చెవికి రంద్రం తో పుట్టావు , అలా పుడుతే ఏమంటారో తెలుసా ,, ఎక్కడో పాత ముసలాడివి పుట్టావని అమ్మమ్మ చెప్పేది , బహుశ పోయిన జన్మ లో నిన్ను పట్టిచ్చు కోకుండా వదిలేసి డాడీ కానీ నేను కానీ వచ్చామేమో అందుకే మల్లి నువ్వు మాకు పుట్టి మాతో పనులు చేపించుకుంటునావు .. నేను నవ్వుకుంటూ చెప్పాను .
అది సంతోషమైన , బాధ ఆయినా , ఇప్పుడు కాకున్నా ఎప్పుడైనా మనం అనుభావిన్చాల్సిందే ...
అని నేను చెప్పినపుడు , నువ్వు ఏమన్నవో గుర్తుందా . మనం పోయిన జన్మ లో రాజులము కావచ్చు , అందుకే ఇప్పటికి మనకు రాజుల లక్షణాలు ఉన్నాయ్ , అన్నావు .
చిన్నా,,,
ఇప్పుడు నిజంగానే నాకు అనిపిస్తుంది ,,,,బహుశ ఏదో జన్మలో నిన్ను పట్టించుకోకుండా వచ్హా మెమో , అందుకే మాతో కొన్ని రోజులు ఉండి నీ పనులు మాత్రం చేపించుకొని వెళ్లావు , మాగురించి ఏమాత్రం ఆలోచించకుండా .....
No comments:
Post a Comment