నీ కోసం నీ 'షు' ఎదురు చూస్తుంది
రోజు పొద్దున్నే నీ కోసం నీ 'షు' ఎదురు చూస్తుంది,,నీవు వాటిని వేసుకొని ఆడడానికి వెలుతావని,
ప్రతీ రోజు నీవు పాలు తాగే నీ ' కప్' ఎదురుచూస్తుంది,, నీవు పాలు తాగడానికి వస్తావని..
ప్రతిరోజు నీ కోసం నీ 'డంబెల్' ఎదురు చూస్తుంది,,నీవు తనని లేపడానికి వస్తావని..
ప్రతిరోజు నీ కోసం నీ ఫుట్ బాల్, నీ కాప్, గ్లౌస్ , వేచి ఉన్నాయి,నీవు వాటితో ఆడుకుంటావని..
రోజు నీకు వచ్చిన 'గోల్డ్ మెడల్స్' నీకోసం చూస్తున్నాయి,నీవు వాటికి జతగా ఇంకో మెడల్ తెస్తావని..
మరో ముఖ్యమైనది , నీ చేతిలో ప్రతీక్షణం ఉండే నీ ఫోన్ , నీ చేతివేళ్ల స్పర్శకై వేచి చూస్తుంది, నువ్వు వస్తావని.
రోజు నాతో గొడవపడి తీసుకొనే టూ వీలర్ 'కీ' , ఏ గొడవ లేకుండా నీకోసం ఎదురుచూస్తుంది.
నీకు మాత్రమే ప్రత్యేకమైన నీ 'లాప్ టాప్' , నీ ఒడికోసం పరితపిస్తుంది.
సోఫా లో నీవు మాత్రమే కూర్చునే చోటు , నీవు కూర్చుంటావని, తనపై పడిన దుమ్మును దులుపుకొని , నీకోసం ముస్తాబవుతుంది, నీ రాకకై..
నీ తలకు తగలకుండ ఒక్కరోజైన నిన్ను లోపలికి ఆహ్వానించాలని,,ప్రతి రోజు గుమ్మం ఎదురుచూస్తునే ఉంది..
అన్నీటికన్న ముఖ్యమైనది.. నీకు నీ స్నేహితులు పదవ తరగతిలో ఇచ్చిన బహుమతిలో ఏముందో , నీవు గొప్ప స్తితిలోకి వచ్చాక విప్పిచూస్తానన్నవు కదా,,, పాపం అది ఇంకా నీవు వస్తవని, తనని విడిపిస్తావని ఎదురు చూస్తూనే ఉంది.....
అందమైన జ్ఞాపకాలు.
ReplyDelete