29 Feb 2016

నీ స్కూల్ ఫ్రెండ్

 నీ స్కూల్ ఫ్రెండ్

నీ స్కూల్ ఫ్రెండ్ ,,,,  అమ్మా, ఏంటమ్మ వీడు నా దగ్గరికి వస్తా అన్నాడు, మామ బీరు తాగుదాం రమ్మంటే ,నన్ను తిట్టాడు అమ్మా,, అసలు ఈ తాగడం ఏంటిరా ,,,ఎందుకు తాగుతారురా మీరు, ఇంకోసారి డ్రింక్ తాగుదాంరా అంటే మాత్రం బాగుండదని మస్తు కోపానికి వచ్చాడమ్మా,,
అమ్మా,,, ఏదైనా మాట్లాడమ్మా,,నాయినను , చెల్లెను చూసుకోండమ్మ,,ఏదైన అవసరం ఉంటే మేమున్నామమ్మా....

అమ్మమ్మ,,,,,,, రణిత వాడి గురించి ఏదైనా చెప్పు,, ఎప్పుడూ వాడి గురించే మాట్లాడుతావు కదా, వాడు అలా, ఇలా అని,,,నేను నీ కొడుకు గొప్పలు చెప్పడం అపేయవే ఇక అన్నాకూడ వాడి గురించే చెపుతావు,,
ఇప్పుడు నేను చెప్పమన్నాకూడ ఏమి మాట్లాడటం లేదు,,ఏదో ఒకటి చెప్పు..

స్కూల్ ఫ్రెండ్ భరత్,,,, ఆంటి మీరు చిన్నప్పుడు మా అందరికి అక్షిత్ తో పాటు సాయంత్రం చదువు చెప్పేవారు, చదువుకోవడానికి మేమంతా వస్తే వాడు కూడ మాతో చదువుతాడని,,వాడికి చెప్పినంత ఒపికగా చదివించారు,, ఒక్కోసారి వాడికి చదవాలని లేకపోతే స్కూల్ లోనే మాకు చెప్పేవాడు, ఈ రోజు ఇంటికి రావద్దురా , మీరు రాకపోతే మమ్మి నాకు కూడ ఈ రోజు హాలిడే ఇస్తుందనే వాడు.
వాడికి అసలు డబ్బుల విలువ తెలియదు ఆంటి, ఎవరు డబ్బులు అడిగితే వాల్లకు వేలైనా ఇచ్చేస్తాడు ఆంటి, పాపం వాల్లకు అవసరం ఉందటరా అంటాడు ఆంటి..

బాబాయిలు,,,,,,వదిన మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు, ఒక్కసారి మీరు వాడిని తీసుకొని వెల్లిన వాడిపై కోపంగా ఉన్నానని చెప్పండి,, మన అక్షిత్ వెల్లిన దగ్గరికే వీడిని పంపిస్తాం..

హై స్కూల్ ఫ్రెండ్ ,,,, ఆంటి, కొత్త బైక్ కొన్నాక వాడికి చూపించాను ఆంటి,, హెల్మెట్ ఏది అని అడిగాడు, నేను డ్రైవ్ చేస్తుంటే, వెనక కూర్చోని, ఏంటిరా ఈ స్పీడు, మెల్లిగా వెల్లు, స్పీడ్ గా ఎప్పుడు డ్రైవ్ చేయకని చెప్పాడు .
సరు తాతయ్య,,,,,,, అసలు ఇది ఎప్పుడన్న సప్పుడు జేయక కూర్చుందా,,నోరు నొప్పి పుట్టేదాక వదురుతుంది, దీనికి ఎదురుగా ఎవరన్న మాట్లాడి గెలుద్దురా,,,
ఇప్పుడుచూడు,,అసలు మాటలే కరువైనట్టున్నాయి దీనికి.

ఇంటర్ ఫ్రెండ్,,,, ఆంటి నేను అక్షిత్ ఫోర్స్ చేయడం వలనే నేను జిమ్ లో చేరాను ,, నేను మల్లీ వచ్చేవరకు నీ బొర్ర కనబడద్దు అన్నాడు,,ఇప్పుడు నేను జిమ్ మానేసాను ఆంటి.

పిన్ని,,,,,,వాడు నా పెద్దకొడుకు, నీకెమవుతుందో అని బయమేస్తుంది అక్కయ్య..

స్పెషల్ ఫ్రెండ్,,,,ఆంటి వాడిని ఎలా పెంచారు మీరసలు, ఆమ్మాయిలతో మాట్లాడ్డానికి సిగ్గుపడుతాడు, నా ఫ్రెండ్స్ అక్షిత్ హాండ్సమ్  గా  ఉన్నావంటే సిగ్గు పడుతాడు,
నాతో మాట్లాడిన అరగంటలో 20 మినిట్స్ మీ గురించే చెపుతాడు , అసలు వాడేంటి అలా...

నీకు ఇష్టమైన ఫ్రెండ్,,,, ఆంటి, ఒక్కసారి నన్ను చూసి మాట్లాడండి, ప్లీజ్...
నేను వాడిని ఏమి చేయలేదు, వాడు నా జాన్ ఆంటి.

అందరు నేనే చంపాను అంటున్నారు, అందరితో నాకు పనిలేదు, మీరు ముఖ్యం నాకు, ఒక్కసారి మాట్లాడండి.
మీరు నన్ను చంపేసినా పర్వాలేదు, కాని ఒక్కసారి మాట్లాడండి ప్లీజ్...

చిన్నా,, ఏంటిరా ఇది, వీల్లంతా నేను మౌనంగా ఉన్నానంటున్నారు, నీతో మాట్లాడుతున్నాగా,,అసలు నాదే తప్పులేరా, నీకు ఏదో ఒకటి చెడు అలవాటు నేర్పించాల్సింది, లేకపోతే నీవైనా నేర్చుకోవలసింది..

' ఏంటి మమ్మి' అంటున్నావ్ కదూ, నాకు తెలుసు...

3 comments:

  1. మీ అక్షిత్ మీతోనే ఉన్నారు.

    ReplyDelete
  2. మంచివారిని పరమాత్మ నీ కర్మ తీరిందని త్వరగా తనలోకానికి తీసుకుపోతాడు. భగవద్గీత చదివి నీ కర్తవ్యం అంటే నీ ధర్మం పాటించు. అమ్మాయిని బాధ్యతాయుతంగా పెంచి, ప్రయోజకురాలుగా చేసి మంచి వరునితో వివాహం చేయి. మీ వారిని కూడా కర్తవ్యోన్ముఖుని జేసి సాధ్యమైనంత వరకు బాధను మరపించే బాధ్యత కూడా మీదే. మగవాడు బాధను బయటకు వ్యక్తం చేయరు. తప్పుగా భావించకు. నేను మరల మనదేశానికి మే నెలాఖరుకు రావచ్చును. వచ్చిన తరువాత మిమ్మల్ని కలవాలని భావిస్తున్నాను. శుభమస్తు.

    ReplyDelete
  3. మంచివారిని పరమాత్మ నీ కర్మ తీరిందని త్వరగా తనలోకానికి తీసుకుపోతాడు. భగవద్గీత చదివి నీ కర్తవ్యం అంటే నీ ధర్మం పాటించు. అమ్మాయిని బాధ్యతాయుతంగా పెంచి, ప్రయోజకురాలుగా చేసి మంచి వరునితో వివాహం చేయి. మీ వారిని కూడా కర్తవ్యోన్ముఖుని జేసి సాధ్యమైనంత వరకు బాధను మరపించే బాధ్యత కూడా మీదే. మగవాడు బాధను బయటకు వ్యక్తం చేయరు. తప్పుగా భావించకు. నేను మరల మనదేశానికి మే నెలాఖరుకు రావచ్చును. వచ్చిన తరువాత మిమ్మల్ని కలవాలని భావిస్తున్నాను. శుభమస్తు.

    ReplyDelete